రామ కథాసారము: అనురాధ మచ్చ

 సీసమాలిక
సంతాన లేమితో సతమతమొందియు
యాగాలు జరిపించె యద్భుతమ్ము,
యాగ ఫలమునొందె యోగము సిద్ధించె
పండంటి పుత్రుల బడసె తాను,
నలుగురు జన్మించె నారాయణుని యంశ
దశరథ పుత్రులై ధరణి యందు,
మువ్వురు రాణులు మురియుచు రాజుతో
ముచ్చటించుచు వారు ముద్దులొలుగ,
కౌసల్య తనయుడు కారుణ్య మూర్తియున్
శ్రీరామచంద్రుడు శ్రీకరమ్ము,
లక్ష్మణ శత్రుఘ్ను లావణ్య మొలికించ
 సుతులు సుమిత్రకు శోభగూర్చె,
భరతుడు జన్మించి భవ్యమై వెలుగొందె
కైకేయి కొడుకుగాఘనముగాను,
ఇక్ష్వాకు వంశము యినకుల సోముడు
రాజలలాముడు రమ్యుడితడు.
తేటగీతి 
రఘు వంశ తిలకుడిగ రామచంద్ర,
ప్రభువు పేరుగాంచియు గొప్ప పెన్నిధాయె,
ధర్మ పరిపాలనను జేసి ధరణి యందు,
తండ్రి మాటను మీరని తనయుడితడు.
కామెంట్‌లు