చెట్టుమీదపండునెవరుకాయమంటుచెప్పింది
పుట్టలాగ మట్టి నెవరు దాయమంటు చెప్పింది
దీనుల కష్టాలను కన్నీటిని తొలిగించగా
అద్భుతమౌకవనమెవరురాయమంటుచెప్పింది
బీదలంత వీడకనేబ్రతికినన్ని రోజులును
బాధలున్నకావిడెవరుమోయమంటుచెప్పింది
చెట్టుకున్న వేర్ల నోర్లు చిగురించగ చూసుటకు
గుట్టుగాను నీటినెవరు పోయమంటు చెప్పింది
కంటిపైన కమ్ముకున్న పొరలన్నియు వేగంగ
పొరబాటునువీడకుండతీయమంటుచెప్పింది
కోకిలమ్మ పాటలన్ని లోకులకే నేర్పితా
అందరినే తనలాగే కూయమంటు చెప్పింది
అమ్మమాట నిండుగాను ఎల్లవేళ దాగుండు
గుండెలోకి ప్రేమంతా తోయమంటు చెప్పింది
మంచితోడు స్నేహిస్తూ మనషులతో పగబూనె
చెడ్డవారిచెలిమినెపుడుపాయమంటుచెప్పంది
శ్రీదేవిగ పాడుకున్న పాటలయలు పొంగించి
అమ్మతోటిబంధమెవరువేయమంటుచెప్పింది
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి