చిన్ని క్రిష్ణుడు(బాల గేయం):-ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట

 యశోదమ్మ ఒడి లోన
      చిన్న బాలుడు
ఆటలాడ వచ్చినాడు
     చిట్టి బాలుడు
గొల్లవారి వాడలోన
      గోపాలుడు
వెన్నదిన వచ్చినాడు
      చిన్ని బాలుడు
మన్నుతిని వచ్చినాడు
     మంచి బాలుడు
నోరు విప్పి చూపమనగ
      నల్ల బాలుడు
చూపెనట భువణభాంఢవం
        చిన్ని క్రిష్ణుడు
యశోదమ్మ కళ్ళ జూసి
      మూర్చ చెందగా
ముసి ముసిగా నవ్వెనట
      ముద్దుల కృష్ణుడు