*అమ్మ!*:-డా.పి.వి.ఎల్.సుబ్బారావు.

 1.మా అమ్మ అపర దేవకి!
   సహనాన మరో జానకి!
  లాలనలో లలితలావణ్యం!
 అది మా పూర్వజన్మపుణ్యం!
2.కమ్మగా తినిపించేది!
   సుద్దులెన్నో వినిపించేది!
   బుద్ధులన్నీ నేర్పించేది!
   కచ్చితంగా నడిపించేది!
3.ఆమే మొదటి గురువు!
    విజ్ఞాన కల్పతరువు!
    చెప్పినది మేటి చదువు!
    జగానసాటిలేని పరువు!
4.బ్రహ్మగా జనని!
   విష్ణువై సుగుణవర్ధిని!
   శివుడై దుర్గుణనాశిని!
   వెరసి త్రిమూర్తిస్వరూపిణి!
5.తనయుడంటే,
           తనివితీరని తల్లి!
   తనకుమారునికి,
            తనకు మారుగా!
   తనయగా తరలి వచ్చింది!
    కన్యాదానానికి,
        యోగ్యత ప్రసాదించింది!

కామెంట్‌లు