1.భూములు! ఆస్తులు!
ఇళ్ళు! వాకిళ్ళు!
విద్య! వైద్యం!
అధికారం! ఉద్యోగం!
దర్జాగా కబ్జా!
2.అడవులు! గనులు!
మార్గాలు! అవకాశాలు!
కోటలు! పేటలు!
చేతివృత్తులు!హస్తకళలు!
దర్జాగా కబ్జా!
3. చెరువులు!
మురికివాడలు!
వల్లకాడులు!
జనావాసాలు!
దర్జాగా కబ్జా!
4.చట్టాలు చుట్టాలు!
న్యాయం జాప్యం!
నీతి మౌనం!
అవినీతి గానం!
5.దోపిడి క్రమబద్దీకరణం!
విలువల వస్త్రాపహరణం!
పరాక్రమం దురాక్రమణం!
ఏమున్నది గర్వకారణం?
రానున్నది!
75వ స్వాతంత్ర్యదినం!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి