వజ్ర సంకల్పం (కైతికాలు ):--ఎం. వి. ఉమాదేవి నెల్లూరు

ఎనభై ఏళ్ళ ఈ అవ్వ 
కట్టెల మోపు తెస్తుంది 
వంట్లో సత్తువ ఉంది 
పని చేస్తాను అంటుంది 
వారెవ్వా పాత తరం 
స్ఫూర్తి నిచ్చు నిరంతరం!

పని చేయక తిండి తినరు 
పసి వాళ్ళుగా నవ్వుతూ 
బిడ్డలపైన ఆపేక్ష 
మనసు నిండుగ నింపుతూ!
వారెవ్వా బంగారవ్వా 
కథలో పేదరాశి పెద్దమ్మా !

అనుభవం పండించే
అక్షయ పాత్రలు వీరే 
మలి తరాన్ని రక్షించే 
సంజీవనులూ వీరే !
వారెవ్వా  బాహుబలి 
అవ్వను చూస్తే సిగ్గుపడు!

కామెంట్‌లు