*అక్షర మాల గేయాలు**'వ'అక్షర గేయం*:- -వురిమళ్ల సునంద,ఖమ్మం

 వనజ, వనిత కలిశారు
వంగ తోటకు వెళ్ళారు
వంకాయలను కోశారు
వంటను బాగా చేశారు
వచ్చిన అతిథులకు పెట్టారు
వహ్వా అని వారు మెచ్చారు

కామెంట్‌లు