గెలవచ్చు (బాల గేయము):పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట.

 ఆటలాడె బాలుడెపుడు 
అలువ బోడు  నెప్పుడైన
మిత్రులంత కూడినంత
మెరుపు తీరు మురిసి పోతు
పోటిలందు నిలిచి నంత
ప్రోత్సహాలు కొన్ని దొరుకు
గట్టి పట్టు పట్టినంత
గాలి తనకు సహకరించు
పట్టినట్టు ఆట యందు
పథక మొచ్చి తీరునట్లు
పలికె మిత్రులు లున్న చాలు
ప్రతిభ చూపి గెలవవచ్చు