బౌమ్మరిల్లు:- సత్యవాణి

 ఇసుక గుట్టను చూస్తేచాలు
బాల్యం గుర్తుకు వస్తుంది
అప్పటికప్పుడు అక్కడ ఆగి
బొమ్మరిల్లు కట్టేయాలనిపిస్తుంది
గుజ్జనగూళ్ళు ఆడేయాలనిపిస్తుంది
కానీ నా వయసు గుర్తుకొస్తుంది
హెచ్చరించి చెపుతుంది
ఆ సమయందాటి
చాలా సమయమైనదని
మనసు మౌనంగా నిట్టూరుస్తుంది
ఇసుక గుట్టకేసి
వెనుక వెనుకకి తిరిగిచూస్తూ
ముందుముందుకు నడచిపోతాను
ఇసుక గుట్ట రా రమ్మని
పిలుస్తున్నట్లనిపిస్తుంది
మనసుని నిగ్రహిస్తాను
అడుగులు బరువుగా పడగా
నా వయసువలెనే
ముందుకు మనుముందుకు
పడతాయి నా అడుగులు
నాప్రమేయం లేకుండగనే