"ఆడ జన్మ" -వై నీరజారెడ్డి ,తెలుగుభాషోపాధ్యాయురాలు.జడ్.పి.హెచ్.ఎస్ కుకునూరుపల్లి
ఆడ జన్మ ఎత్తి నీవు, అగచాట్లు పడతావు. 
విలువ లేని జీవితాన్ని, జన్మంతా భరిస్తావు. 


మౌనం నీ ఆయుధం. బాధలు నీ జీవితం 
అలుపులేని పోరాటం లో, కరిగే కొవ్వొత్తి నీవు. 


ఉద్యోగిగా మారిన, మారలేదు నీ రాత.
 సమాజంతో పోరాడుతూ, ఎదగాలని ఆరాటం

.
 మర్యాద లేని మగడు ముల్లులా గుచ్చు తున్న,
 కన్నీటి సంద్రాన్ని, కడుపులోనే దాస్తావు. 

నేను పుట్టించిన ఆ దేవుడు, 
కరుణ లేని కఠినాత్ముడు. ముళ్లబాట నే పరిచి,  
పయనం సాగించ మన్నాడు. 


తరాలు ఎన్ని మారినా ,నీ తలరాత మారదా యే.
 యుగాలు ఎన్ని మారినా, ఈ తంతు మారలేదు.