తమ పనులే మేలు (బాల గేయము):-పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట.
నీటిలోని చేపలు 
గాలిలోన పక్షులు
నేలపైన జంతువులు
వాటికి ఎన్నొ ముప్పులు

చేస్తాయి స్నేహాలు
కలిసి మెలిసి ఉంటాయి
ఆడుతాయి ఆటలు
ఆనందంగా ఉంటాయి 

ధైర్యాన్ని చూపుతాయి
సమస్యలను ఎదిరిస్తాయి
తెలివిగానే ఉంటాయి
తమ పనులే మేలంటాయి.

కామెంట్‌లు