వాళ్లిద్దరూ ...!! (చిత్ర కవిత):-----డా.కె.ఎల్.వి.ప్రసాద్ హన్మకొండ .

 ఆమె సౌంధర్యవతి !
అయినా .....
ఆమెలో .. ఆమె
చెదిరిపోయిన
స్వప్నాన్ని .....
తరగని ---
ఆలోచనలతో
మస్తిష్కాన్ని
మరగబెడుతోంది !
మరో పార్ష్వంలో,
ఈమె.....
అనాకారి కావచ్చు
ఈమెలో ఆకర్షణ..
అంతలేకపోవచ్చు..
స్వేచ్చగా స్వచ్చంగా
తృప్తిగా బ్రతకడం
ఈమెబ్రతుకులోని
కిటుకు....
నవ్వుల సామ్రాజ్యంలో
నిత్య సంతోషిణి ఈమె!
ఆత్మ సౌందర్యానికి
చక్కని మాదిరి ఈమె !!