నాటిన మొక్కే నాటకు
నాటిన మొక్కను పీకకు
పోకిరి పనులు చేయకు
ఫోటో ఫోజులు కొట్టకు
వారెవ్వా మీ పనితనం
తెలిసిందిలే అసలు గుణం
ఇచ్చిన హామీ ఇవ్వకు
ఇచ్చిన హామీ మరవకు
చెప్పిన మాటే చెప్పకు
ఊహా లోకం తిప్పకు
వారెవ్వా మీ ఉపన్యాసం
ప్రజా వేదికన రసరమ్యం
చేసిన పనినే చేయకు
చేయని పనిని చెప్పకు
చేతిలో స్వర్గం చూపకు
చెప్పిన హామీ మరువకు
వారెవ్వా మీ పనితీరు
ప్రజా వేదికన యమజోరు
స్వార్ధపు నీడకు వెళ్లకు
సహనం తప్పి నడవకు
స్నేహం విలువను మరువకు
సహచర మైత్రిని వీడకు
వారెవ్వా మీ సాన్నిహిత్యం
కొనియాడాలి ప్రతినిత్యం
నమ్మని వారిని పిలవకు
నమ్మిన వారిని గెంటకు
నమ్మకం పోతె తలుచకు
నమ్మిన బంటును చంపకు
వారెవ్వా మీ నిజాయితీ
జేజేలు పలికే భరతజాతి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి