చదవండి:- సత్యవాణి

చదవండోయ్ చదవండీ
మంచి పొత్తములు చదవండీ
చదవండోయ్ చదవండీ
మంచి పొత్తములు ఎంచుకు ఎంచుకు ఎంచుకు చదవండీ

రాజలకథలు రాణుల కథలు
పులుగుల కథలు మృగముల కథలు
కీడును కలిగించే
కీటకముల కథలు
పలు రకముల కథలెన్నెన్నోపరిశీలనగా చదవండి
చదవండోయ్ చదవండీ
మంచి పొత్తములు చదవండీ

పిల్లల కథలు పెద్దల కథలు
ప్రేమతొ పెంచిన తల్లుల కథలు
కృష్ణని కథలూ రాముని  కథలు ద్రోణునివంటీ
గురువుల కథలూ
చదవండోయ్ చదవండీ
మంచి పొత్తములు చదవండి

భక్తుల కథలు భారత కథలు 
దీనులకథలు
వీరులకథలు
దివ్యమైన ప్రబంధ కథలు
చదవండోయ్ చదవండీ
మంచి పొత్తములు చదవండీ

సైన్స్ కథలు సాహస కథలు
చక్కనైన సమాజపు కథలు
దేశ దేశాల చరిత్ర కథలూ
చదవండోయ్ చదవండీ
మంచి పొత్తములు చదవండీ
ఎంచుకు ఎంచుకు చదవండీ