జీవన రాగం ....!! (ఆన్షీలు):-డా.కె.ఎల్.వి.ప్రసాద్,హన్మకొండ.

 వర్షపు నీరేకదా అని చిన్నచూపు వలదు సుమా ,
ఒడిసి పట్టి ప్రతి చుక్కా ఇంకుడుగుంతకు మళ్లిస్తే 
భూగర్బ జలాల తీరు మెరుగవ్వు ప్రతి  వేసంగికి !
వినుము కె.ఎల్వీ.మాట  నిజము   సుమ్ము...!!
-----------------------------------------------------------------
మురుగు నీరు వర్షపు నీరు వృదాకానీయబోకుమా 
పెరటి మొక్కలకవే అమృత ధారలు కావచ్చుసుమా! 
పిల్ల కాలువలు చేసి ప్రవహింప జేయవలె మొక్కలకు 
వినుము  కె.ఎల్వీ. మాట  నిజము  సుమ్ము...!!
------------------------------------------------------------------
వేసవిలో  నోరూరించు రకరకాల మామిడిపళ్ళు 
తిననివారుండరు ఎవరూ  మామిడిపళ్లు ఈ జగాన 
టెంకలుపడవేయక పాతిపెట్టవలె వర్షాకాలాన ...!
వినుము  కె.ఎల్వీ.మాట  నిజము  సుమ్ము....!!
------------------------------------------------------------------
త్రాగు నీరు  అమూల్యమని తెలియదుకొందరికి 
కాలనీలలో లీకేజీలు పట్టించుకోరు ఎందరో !
మంచినీరు కరువైనప్పడు తెలుస్తుంది విలువ 
వినుము  కె.ఎల్వీ.మాట నిజము  సుమ్ము....!!
-----------------------------------------------------------------
లీకేజీలు చూసినవారు చప్పున స్పందించవలే 
అధికారుల దృష్టికి తక్షణమే తీసుకురావలె సుమా!
నీటివృధామాత్రమేకాదు నీటికలుషితం జరుగుకదా
వినుము కె. ఎల్వీ.మాట  నిజము  సుమ్ము....!!
----------------------------------------------------------------
నీటి కొరత రాకుండా పాలకులు జాగ్రత్త వహింతురు
ప్రజా సంక్షేమమే వారి ద్యేయంగా భావింతురు ...
వారికిసహకరించుట ప్రతి పౌరుడి బాధ్యత సుమీ !
వినుము  కె.ఎల్వీ.మాట  నిజము  సుమ్ము....!!
-----------------------------------------------------------------