ముద్దుల పాపాయి:--గద్వాల సోమన్న , ఎమ్మిగనూరు.

పాపాయి పలక
చేత పట్టింది
తెలుగాక్షరాలు
ముద్దుగ వ్రాసింది

అమ్మకు చూపింది
మెప్పు పొందింది
ప్రేమతో తల్లికి
ముద్దు పెట్టింది

అమ్మ ఒడిలోన
హాయిగా ఆడింది
ఆకలి వేయగా
కడుపు నింపింది

అమ్మ జోల పాటను
అలకించింది
అలసిన పాపాయి
నిదుర పోయింది

కామెంట్‌లు