విజయపురిని ఏలే రాజు విక్రముడు . ఒకరోజు అతడికి ఓ సందేహం కలిగింది. తనకన్నా గొప్పవాడు ఈ ప్రపంచంలో ఉన్నాడా? అనేది ఆ సందేహం. ఒక వేళ ఉంటే అతడేవరో తెలుసుకోవలనే కుతూహలం కలిగింది. వెంటనే సభ ఏర్పాటు చేశాడు. అందరూ సమావేశం అయిన తరువాత పక్కనే ఉన్న మంత్రితో తన మనసులో ఉన్న సందేహాన్ని వివరించాడు. .
మంత్రి తడుముకోకుండా "శ్రమజీవి మాత్రమే ప్రభు తమరికన్నా గొప్పవాడు" అన్నాడు. "అదెలా" అన్నాడు రాజు ఆశ్చర్యపోతూ. "ఔను రాజా! వాడికి ఏ ఆలోచన ఉండదు. పొద్దునే లేస్తాడు. పనికి వెళతాడు. కండలు కరిగేలా కష్టం చేస్తాడు. పావలా డబ్బులు సంపాయిస్తాడు. వాటితో తినటానికి కావలసిన సరుకులు తెస్తాడు. భార్య పిల్లలతో హాయిగా గడుపుతాడు. సుఖంగా నిద్రపోతాడు. అంతేకాక వాడు చేసే శ్రమవల్లనే మనం ఏ పని చేయకుండానే నాలుగు మెతుకులు తినగలుగుతున్నాం. వాడు పనిచేయకుంటే మనం పస్తు పడుకోవాలసిందే. ఇప్పుడు చెప్పండి. మీ కన్నా గొప్పవాడు శ్రమజీవే కదా? రాజు చాలా సేపు ఆలోచించాడు. ఔనని అంగీకరించాడు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి