శరీరమే చెప్తుంది-శరీరమే చేస్తుంది !?:-సునీతా ప్రతాప్
ఒక పసిపిల్లవాడు పరీక్ష పాస్ కావాలనుకుంటాడు అదే అతని కల.
ఒక రాజకుమారుడు రాజు కావాలనుకుంటాడు అది అతని కల.
అయితే రాజకుమారుడు రాజు అయితే తప్ప పిల్లవాడు పాస్ అవ్వలేడు, లేదా పసిపిల్లవాడు పాస్ అయితే తప్ప రాజకుమారుడు రాజు అవ్వలేడు.
రాజకుమారుడు రాజు కావడం వలన పసిపిల్లవాడు కూడా రాజు అయినట్లు కలగంటాడు. కానీ రాజు అయిపోడు కేవలం 
కలలో రాజుల మారిపోతాడు.
అది కల మాత్రమే రాజకుమారుని కలలోకి పసిపిల్లవాడు ప్రయాణిస్తాడు.

నిజం అనుకుంటే కల మాయా అవుతుంది.
కల అనుకుంటే మానసిక రోగి అవుతాడు.
ఇప్పుడు ఎవరి కళ్ళలోకి ఎవరైనా వెళ్ళవచ్చును.
కానీ వేరే వాళ్ళ కలలోకి మనం వెళ్ళిన మన కలలోకి వేరే వాళ్ళు వచ్చినా ఆశ్చర్యం ఏమీ లేదు.
ఒక శవం తప్ప,
శరీరం మనసు ఉన్న ఏ శరీరమైన, ఈ పని చేస్తుంది.
శరీరం నిజం. మనసు మాయ కాదు.
శరీరం నిజం మనసు నిజం.
రెండు రెండు లోకాలు. ఏలే వారు ఒకరే.

ఏది గెలిస్తే అదే నిజం.
కానీ గెలిచినా కనిపించనిది మనసు.
కనిపించేదే నిజం
కనిపించనిది కల.
కలలో, నీ కల నీకే తెలుస్తుంది.
అదే నీ గెలుపు.
నీ కల వేరే వాళ్లకు తెలిస్తే
అది నీ ఓటమి.!? వాళ్ల గెలుపు.
అదే శాస్త్రం చెబుతోంది.!?

శరీరానికి ఎంత శక్తి ఉందో,
మనసుకు అంత శక్తి ఉంది.
అందుకే రెండు ఒకటే,
రెండు శరీరాలే!?
శరీరమే చెప్తుంది శరీరమే చేస్తుంది !?

 Sunitapratap
Teacher.palem
8309529273

కామెంట్‌లు