యాగము చేయ నెంచె
ఋషి విశ్వా మిత్రుడు
లోక కళ్యాణం కొరకు
మదిలో తలచె కౌశికుడు
వారెవ్వా!ద్విజోత్తమా
నీకు మా ప్రణతులు గొనుమా
మారీచ,సుభాహు వలన
కీడును శంకించెను
యాగ భంగమగు నని
మనసున తాపసి తలచెను
ఆహా!విశ్వామిత్రా,
దివ్య దృష్టి భూషితా..!
యాగరక్షణ చేయమని
ద్విజుడా ప్రభున్ కోరెను
రామలక్ష్మణ కొమరులని
తనతో పంపమనెను
ఆహా!విశ్వామిత్రుడు
లోక రక్షాకాముకుడు
పసివారలు బాలలని
ధశరథుడు శంఖనొందెను
రక్షగా వచ్చెదనని
ఋషికి ధరపతి తెల్పెను
భళిరే!దశరథుని పుత్రవాత్సల్యం.
బంధనమైన,పుత్రవ్యామోహం
పంపెను అయోద్యరాజు
ఋషితొ రామలక్ష్మణులను
ముదమున విశ్వామిత్రుడు
తోడ్కొనివెళ్లె నిరువురను
ఆహా!కాలమహిమ!
విధిలీలనాప తరమా!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి