సమయనుకూలం(కరోనా కథ)-డా.కందేపి రాణి ప్రసాద్

 రాఖీ పున్నమి దగ్గర పడుతుంది ప్రతి యేడు అన్న మస్కట్ లో ఉన్నా ప్రత్యేకంగా వచ్చి మరి రాఖీ కట్టించుకొని పోయేవాడు ఈ సారి పరిస్థితి ఏందో అర్థం కావడం లేదు మాయదారి కరోనా జేయబట్టి ఎక్కడికక్కడ విమానాలు నిలిచిపోయే మనుషులు ఒక్కనొక్కలు చూసుకునుడే కారువైపోయే పిల్లలు కుడా ఎంత సంబరంగా ఉండేటోళ్ళు మాయ వస్తే బొమ్మలు తెస్తాడు అని మురిసే టోళ్లు బళ్లు లేకపోయే సంబరాలు లేకపోయే పండుగలు పబ్బాలు లేకపాయే ఏందీ బతుకు అర్థం అయితలేదు అనుకుంటూ ఆలోచించుకుంటూ ఎంత సేపుండి పోయిందో తెలియలేదు పక్కింటి వనజ వచ్చి చేటలో బియ్యం పోసుకొని ఏమలోచిస్తున్నావ్ అనేదాక 
కృష్ణవేణి వనజలది ప్రక్కప్రక్క ఇళ్ళు ఇద్దరి భర్తలు స్వర్ణ కారులే ప్రపంచీకరణ వల్ల ఇద్దరి కుటుంబాలు అంతంతా మాత్రంగా సాగుతూండేవి ఇప్పటి కరోనా దెబ్బకు ఆ కాస్తా బందైపోయింది పెళ్లిళ్లకు ముహూర్తలేవ్ చచ్చిపోయినోళ్ళకు కర్మ కాండలు లేవు కృష్ణవేణి భర్త బంగారు ఆభరణాలు తయారు చేస్తాడు అసలే అంతంతా మాత్రంగా  తాళిబొట్లు ఉంగరాలు ముక్కు పొగులు చేయించుకునేవాళ్ళు కూడా లేరు కరోనా దెబ్బకు అదేంటో రిజిస్టరు ఆఫీస్ పెళ్లిళ్లు చేసుకుంటున్నరంట తినడానికీ తిండి లేకా పిల్లలు గోల పెడుతున్నారు 
   వనజది అదే పరిస్థితి ఆమె భర్త శ్రీకాంతాచారి పంతులు పెళ్లిళ్లు వంటి పెద్ద  కార్యాలకు పిలవకపోయినా తద్దినాలు పెట్టుకు బతుకుదామన్నా  ఆది లేదు ఇళ్లల్లో చనిపోయినప్పుడు  రోజులు కార్యక్రమాలు చేయటానికి కొడుకులు కొట్టుకుంటున్నారు అసలు బతుకుతున్నప్పుడు వాళ్లకు తిండి పెట్టడమే  దండగ అనుకునే రోజులాయే ద్వాదశ దినకర్మ దిక్కు లేకపోతే తద్దినాలు ఎవరు పెట్టేది అసలు పరిస్థితి  ఇలాగుంటే కరోనా కాలంలో  శాస్త్రీయంగా జరిగే తంతులే లేవు జేసీబీ లతో శవాలను పూడ్చిపెట్టడమనయె 
          కృష్ణవేణి చేటలో బియ్యం చూస్తూ ఈ కాసిని అయిపోతే ఎం చేయాలా అని ఆలోచిస్తున్నది అప్పుడే వనజ వచ్చి వదినా మాములు పరిస్థితుల్లో మన ఇంటి ఆడవాళ్లు గడపదాటి బయట అడుగుపెట్టారు కానీ ఇలా కడుపులు మాడ్చుకోవడం కంటే మనమన్నా ఏదైనా పని దొరుకుతుందేమో చూద్దామా ? అడిగింది కృష్ణవేణి ని
      మనకేం పనులొచ్చు వనజ మనం చదివిన పదో తరగతి ఉద్యోగలెవరిస్తారు అసలు ఉద్యోగలొచ్చేవారు దేవరు కరోనా కాటుకు అవుది కృష్ణవేణి  నేను చెప్తా కదా మన విధి చివరి సూపర్ మార్కెట్లో బియ్యం కందిపప్పు సరుకుల్ని రాళ్ళు మట్టిబెడ్డలు లేకుండా చేరగడానికి ఆడవాళ్లు కావాలన్నారు మనిద్దరం వెళ్దాం సంప్రదాయాన్ని పక్కన పెట్టి కష్టపడి పనిచేసుకుందాం కష్టకాలంలో కుటుంబాలను  అదుకుందాం అన్నది వనజ ఇద్దరు సరేనని రేపటి నుంచి పనిలో కెళ్ళాలని నిర్ణయించుకున్నారు సమయానుకూలంగా పనులు చేసుకోవాలి