సీసమాలిక పద్యంపెద్దలు ముద్దుగన్ ప్రేమతో జూసినవరుడుని నొప్పును వద్దనకను,మంచి చెడ్డలగని మాట ముచ్చటలతోపెండ్లి జేయుదురిల ప్రేమతోడ,కట్టుబాట్లకు నిల్చి కష్టము లెన్నియోభరియించి యుండును పడతినిలన,అమ్మ నాన్న నడక యాదర్శమవునురాత్యాగాలగనికదా ధరణ జూడ,సంసారసాగర జలకాల నాటలోసుడిగుండములనిల జూడతరమ!,మనసెరిగిన నాన్న మక్కువై యమ్మకున్జగమౌను నాన్నకు సగమునైన,కష్ట నష్టాలలో కలసి యుండి నడుపుపిల్ల పాపలతోడ ప్రీతి జెంది,నాన్నలో సగమౌను నడకలో యమ్మయేబ్రతుకు బండిని లాగు భవ్యముగను.తేటగీతి.అమ్మ నాన్నల పెంపున హాయినొంది,పిల్ల పాపలు వృద్ధియౌ ప్రేమతోడ ,ఆదిదంపతుల విధము నవనియందు,చూడ ముచ్చట గొల్పును చూపరులకు.
అమ్మకు నాన్న యే జగము:- మచ్చ అనురాధ-తెలుగు భాషోపాధ్యాయురాలుజి.ప.ఉ.పాఠశాల కుకునూర్ పల్లి, కొండపాక మండలం , సిద్దిపేట జిల్లా.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి