*మూడవవాడే!*:-డా.పి.వి.ఎల్.సుబ్బారావు.

 గురుపౌర్ణమి/వ్యాసపౌర్ణమి శుభాకాంక్షలతో
      ---------------------
1.అతిముఖ్యుడు!
   అసలైన ఘనుడు!
   కన్న కడుపు!
   పెంచిన చేయి!
   ధన్యం చేసేవాడు!
2.భుజబలం!
   బుద్ధి వికాసం!
   జ్ఞానప్రకాశం!
   అతడి అనుగ్రహమే!
3.శిల - శిల్పం!
   కొండ-కోవెల!
   వెదురు-వేణువు!
   అణువు-మేరువు!
   అతనికే సాధ్యం!
4.సృష్టికర్త!
   వృద్ధిప్రదాత!
   లయకారుడు!
   సగుణనిర్గుణుడు!
5.లౌకికం!
   పారలౌకికం!
   సకలవిద్యారాశి!
   శిష్యవాత్సల్యవారాశి!
6.పురుషార్థాలమూలమతడే!
   అతడి!
   రూపమే ధ్యానమూలం!
   పాదమే పూజా మూలం!
   వాక్యమే మంత్రమూలం!
   కృపయే మోక్షమూలం!

కామెంట్‌లు