కన్యక* (కథ)("రాజశ్రీ" సాహిత్య ప్రక్రియలో)(నాలుగవభాగము):-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 13)
డేగ పిట్టను విడుస్తుందా
కన్నె ఇంటికి మరలుతుందా
రాజుకు గాంధర్వ పద్ధతి
పెండ్లి చేకొనును ఉధ్ధతి!
14)
ప్రేమ ఉంటే కూతువిడిచి
ఇప్పుడిక్కడె పెండ్లిజెయ్యి కేలుమోడిచి
రాజుమాట విన్నతండ్రి బాగా యోచించె
తప్పదిక మొండిరాజు అని తలంచె!
15)
ముందుగా మావిధి దైవకార్యము
తదుపరి కాదా రాచకార్యము
గుడికి పోయి యిప్పుడే
మరలి వత్తుము ఒప్పుడే!
16)
అనిన శెట్టి మాటలను
వినిన రాజు వారి బాటలను
అయిన సరియే మేము వత్తుము
గుడిలోనే పూజారి సత్తము!
(సశేషం)