శ్రీరాముడు:--సరళ గున్నాల
కం*రామా నామామృతమును
నామానసమందువిడువ నారాయణుడా
నేమముతోభజియింతును
ఈమా శుభకరములనిల నీప్సితమందన్

కం*
ఒక భార్యయు నొకబాణము
నొక మాటయునాడువాడు నొరులకు ప్రేమల్
నొకటిగపంచెడి వాడై
సకలమ్ములు శుభగుణముల సాకేతుడిలన్

ఉ*మాటనుదాటబోడు తన మంచినిపంచుచులోకమందునన్
వాటముజూచిరక్కసులు వ్రాలగనేలను వేయబాణముల్
ధీటుగనెవ్వరయ్య సరితేజముపంచెడిధీరులెచ్చటన్
బాటనువీడబోక మిము ప్రార్థనజేతుము కోసలేశుడా

కం*సాకేతరామ నామము
మీకీయును శుభములెల్ల మిక్కుటములుగన్
చేకొని పూజలుసల్పిన
తాకగ పాపములనెల్ల తరపున్నెపుడున్

తరపు=హరించు

కం*తలదాల్చరామనామము
తలపించును స్వర్గసుఖము తలపులలోనన్
తిలకించరామరూపము
నిలసాటియురాదునేది నీప్సితమలరన్

మ.కో*రామనామము రమ్యమైమది
రామనామము తీపియే
రామనామము మానసంబున
రాగమొల్కగజేయునే
రామనామము భక్తియోగము
రంజుగా మదినింపుచున్
రామనామము ముక్తినిచ్చుచు
రశ్మిపంచును నుల్లమున్

కం*నమ్మినవారినివీడక
కమ్మినచీకటులనెల్ల కాదనియనకన్
ఇమ్ముగభార్యనుచేకొని
తమ్మునితోగూడిజేరె తడవక నడవిన్

మ.కో*ఏమిజేసిన నెన్నిజెప్పిన నెన్నిమాటలనాడినా
రామనామము వీడకుండిన
రమ్యమౌగద శక్తియున్
భామసీతను భక్తిగొల్చిన
భాగ్యమందును స్త్రీలకున్
నేమమింతయువీడకుండగ
నీదుపూజలజేయుదున్

చం*జనకునిమాటదప్పడట సౌమ్యుడురామునిగూర్చిజెప్పగన్
మనమున పొంగు భక్తియును మాటలమాటున దాగుకీర్తనల్
వినబడుచుండు నెప్పటికి వీడకజేయగస్వామిపూజలన్
తను నిడు సంపదల్ మనకు ధాన్యపురాసులునింపుచుండుగా