బాపు బొమ్మ,దత్త గురువు(తేటగీతి పద్యాలు)డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,సికింద్రాబాద్.

              :బాపుబొమ్మ:
అతివ సింగార మురిపెము అద్ద మునను
వేణి, కుప్పెలు మల్లెల వేద్య మవ్వ
తీర్చి దిద్దిన కనుబొమ తీర్చె వేడ్క
మగువ యందము చూసిన మనసు మారె
            :దత్తగురువు:
దత్త గురునికి వందనం ధ్యాన రూప
మురిసి చూసెడి జనులకు ముగ్ధ కుజము
రవిని చంద్రుని దలదాల్చి రాజ సముగ
బుధులు పూజలు సల్పిన బుద్ధి నివ్వ