*కన్యక* (కథ)("రాజశ్రీ" సాహిత్య ప్రక్రియలో)(మూడవభాగము):-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్

 9)
పట్నము ఏలే మహారాజా
చేతురు దైవముకే మొదటిపూజా
ఇదేఆన నాకూతురు నీదుసొమ్ము
మీకోరిక తీర్చుతాము మమ్మునమ్ము!
10)
ఇప్పుడు ఇక్కడ ఈదారిమధ్యన
ఇరుకు బెట్ట ధర్మమగున
రేపు మీకు పెండ్లిజేసి
గౌరవముతో ఇత్తుము భార్యగాజేసి!
11)
కన్యతండ్రి మాటవిన్న రాజంతట
కోపాన కళ్ళు ఎర్రజేసె నంతట
కన్యతండ్రితొ ఇలాఅన్నాడు హేళనగ
అక్కడున్న వారు అంతా వినగ!
12)
ధర్మం రాజు తలచిందే
శాస్త్రం రాజు చెప్పిందే
రేపు మాపు అని చెప్పబోకు
గడువులు ఏమీ పెట్టబోకు!
(సశేషం)

కామెంట్‌లు