అది ఐదు అంతస్తుల అపార్ట్మెంట్ థర్డ్ ఫ్లోర్ లో ఇద్దరు భార్యాభర్తలు ఉంటున్నారు. భర్త ఆఫీసుకు వెళ్ళగానే భార్య రమణి తలుపులు వేసుకుని పడుకుంది. ఆమెకి రెండు రోజులుగా తలనొప్పి భారంతో ఉంటున్నది. ఇంతలో ఎవరో ఆడమనిషి డోర్ బెల్ విరామం లేకుండా మోగించింది. రమణి ఇ తలుపు తీసి ఎవరు కావాలి అంటూ ఉండగానే వడివడిగా లోపలికి వస్తూ ఉన్నది ఆమె చేతిలో చంటి పిల్లవాడు ఉన్నాడు మరో చేతికి ఒక సంచి తగిలించుకొని ఉన్నది ఎవరు కావాలి అని అసహనంగా అడిగింది రమణి. అత్యవసరంగా బాత్ రూమ్ కి వెళ్లాల్సి వచ్చింది కాస్తాయి పిల్లవాడిని పట్టుకోండి అంటూ అందించ బోయింది. ముక్కు మొఖం తెలియని వాళ్ళనే లోపలకి రానివ్వ వద్దని చెప్పి వెళ్ళాడు రమణి భర్త. ఇప్పుడు ఇంట్లోకి రావటానికి వీల్లేదంటూ బలవంతంగా ఆమెను బయటకు నెట్టి తలుపులు వేసుకుంది. ఒక ఆడమనిషికి సాయం చేయలేకపోయానని బాధగా ఉన్నా ఎవరిని నమ్మని రోజులివి. అందుకే అలా చేయవలసి వచ్చింది. ఆమె అక్కడి నుంచి ఎదురు పోర్షన్ లోకి వెళ్ళిపోయింది నేను ఏమీ పట్టించుకోలేదు. ఆ మధ్యాహ్నానికి రమణి భర్త సుందర్ రావు వచ్చి నొక్కాడు ఎవరో అనుకుని తలుపు తీయలేదు. అదే పనిగా మోగటం తో తలుపు తీయక తప్పలేదు. సుందర్ రావు లోపలికి వస్తూనే నువ్వు బాగానే ఉన్నావా మన ఇంట్లో ఏమైనా నా దొంగతనం జరిగిందా. వస్తువులు ఏమైనా పోయాయా అన్నాడు. అన్ని ఫ్లాట్ల లోను వస్తువులు గమ్మత్తుగా పోయాయి ఎవరు దొంగతనం చేశారు తెలియదు అన్నాడు. ఆయన వెనకాలే ఒక గుంపు అందరూ ఇది పోయింది అది పోయింది అని చెప్పుకుంటున్నారు. పోయిన వన్నీ లిస్టు వాచీలు మొబైల్ ఫోన్లు ఆభరణాలు ఫోన్లో పర్సులు డబ్బులు అంటే సులభంగా తీసుకొని పోయేవి కాబట్టి ఎవరు గమనించలేదు. పోలీసులు వచ్చి అందర్నీ ప్రశ్నించారు. ఆ దొంగ అందమైన అమ్మాయి పిల్లవాడితో వచ్చిందని ఆ అమ్మాయిని చివరకు పోలీసులు పట్టుకున్నారు. విచారించగా తెలిసింది. చిన్న పిల్లవాడిని ఎత్తుకొని భుజాల బ్యాగు తగిలించుకుని బాత్రూం కోసం వచ్చి చిన్న చిన్న దొంగతనాలు చేసి ఆ వస్తువులను వేసి అందించేది ఆమె కోసం ఒక ఆటో సిద్ధంగా ఉండేది. వాడు అలా ఎందుకు చేస్తున్నారో తర్వాత తెలిసింది. ఆమె భర్తకు వ్యాపారంలో కష్టం వచ్చింది . బ్యాంకు నుండి అప్పు తీసుకున్నారు అవి చెల్లించ లేకపోతే వాళ్ల ఆస్తులు జప్తు చేశారు. విలాసాలకు అలవాటు పడ్డ జీవితాలు. వీళ్ళను చూసి ఇ ఎవరు ఉద్యోగాలు ఇవ్వలేదు. అందుకే ఇలా దొంగతనం చేస్తున్నారు దొంగిలించిన వస్తువులను బజారులో అమ్మి సొమ్ము చేసుకునే వాళ్ళు. దొరికితే దొంగ అ లేకపోతే దొర అన్నట్టుంది వీళ్ళ తీరు. అప్పటి నుంచి ఎవరైనా ఆడవాళ్ళు ఏదో వంకతో ఇంటికి వస్తే తలుపులు తీయకూడదని మేమంతా నిర్ధారించుకుని జాగ్రత్త పడటం చేస్తున్నాం.
లేడీ దొంగ. .:-తాటి కోల పద్మావతి. గుంటూరు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి