1.మన చిరునామా!
ఆకాశం కింద!
భూమి మీద!
కులం వ్యాకులం!
మతం మాలిన్యం!
2.జన్మ నక్షత్రాలు ఒక్కటే!
జాతకచక్రాలు ఒక్కటా?
ప్రవహించే రక్తం ఎరుపే!
అదే గ్రూపో ఎవరికెరుక!
3.బాహ్యప్రకృతి,
పంచభూతాలే!
అంతరంగప్రవృత్తి,
విచ్చుకత్తులే!
రహదారులెన్నో,
వేసి ఉంచారు!
ఎవరి ప్రయాణాల్లో,
వారు ఉంటారు!
4.ముఖాలు చిరపరిచయమే!
మాస్క్ లతో కొత్త వైనమే!
ఆవరించిన ఆపద ఒక్కటే!
అదుకోవాలంటే,
మన మధ్యస్థిరదూరమే!
5. విధి నెదిరిస్తున్నాం!
తలవంచుతున్నాం!
కలిసివస్తే నవాబులం!
కాకుంటే గులాములం! బతుకంటే ద్వంద్వాలసరాసరి!
తెలిసికుంటే నిజమిదే మరి!
*మన!*:-డా.పి.వి.ఎల్.సుబ్బారావు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి