ఎక్కడిదో ఈ రాక్షస వైరసు కరోనా పేరుతో వచ్చి
మందిలోచోరబడి ఎందరినో మట్టుపెడుతున్నది !
మన జాగ్రత్తలే దాని వికటాట్టహాసానికి మందు ,
వినుము కె.ఎల్వీ .మాట ,నిజము సుమ్ము ...!!
-------------------------------------------------------------------
మాస్కు ధరించవు ,భౌతిక దూరము పాటించవు ,
పరిశుభ్రతలేదు ,జాగ్రత్తలపై -జాగ్రత్తలేదు -
ఒక్కడి అజాగ్రత్త పెక్కుమంది ప్రాణాలకు ముప్పు !
వినుము కె .ఎల్వీ.మాట,నిజము సుమ్ము.....!!
---------------------------------------------------------------------
వేడి నీల్లు త్రాగాలి,ఆవిరి పట్టాలి రెండుపూటలా ,
విటమిన్ -సి ,డి ,లు --పౌష్టికాహారం తీసుకొవాలి ,
మనజాగ్రత్తలే ,మనకురక్ష ,మనసుపెట్టు సోదరా
వినుము కె.ఎల్వీ.మాట,నిజము సుమ్ము.....!!
--------------------------------------------------------------------
ఊపిరి తిత్తుల మీదనే మనసుప డే,వైరసును
మట్టుపెట్టకుంటివా ?తుదముట్టించకుంటివా ,
నీ అంతుచూచునది గమనించుము సొదరా ...!
వినుము కె.ఎల్వీ.మాట నిజము సుమ్ము.....!!
--------------------------------------------------------------------
భయమువద్దు,నిర్లక్ష్యము అసలు వద్దు....
మనసు పెట్టి మందులు వాడుకో,జాగ్రత్తలు తీసుకో
మంచి ఆహరం తిని,ఇమ్యునిటీ పెంచుకో ....
వినుము కె.ఎల్వీ.మాట,నిజము సుమ్ము......!!
--------------------------------------------------------------------
జ్వరము,తలనొప్పి,వళ్ళు నొప్పులు ,జలుబు ....
రుచుల కోల్పోవుట ,వాసన తెలియకపోవుట ...
మహమ్మారి కరోనా అస్తిత్వపు చిరునామా ...!
వినుము కె.ఎల్వీ. మాట, నిజము సుమ్ము.......!!
------------------------------- -----------------------------
బడులు-గుడులు-మసీదులు, మూతబడిపోయే
బంధు -మిత్రులను కలువలేని దౌర్భాగమయ్యే !
కాలమహిమ చూడ ఎన్నెన్ని వింతలో గదా ...
వినుము కె .ఎల్వీ.మాట నిజము సుమ్ము....!!
------------------------------------------------------------------
పిల్లలకు మొబైల్ ఫోన్ ఏలయనిరి పెద్దలొకప్ఫుడు,
అంతర్జాల చదువులకు సెల్ఫోను దిక్కాయెనిపుడు!
ఎప్పుడు,ఏమి,ఎటుల జరుగునో ఎవరుచెప్పగలరు
వినుము కె.ఎల్వీ.మాట నిజము సుమ్ము....!!
--------------------------------------------------------------------
జీవనరాగం ...!!(వచన పద్యాలు):-డా.కె.ఎల్.వి.ప్రసాద్,హన్మకొండ.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి