దాశరథి కృష్ణమాచార్యలు:-సామలేటి లింగమూర్తి సర్వక్రియ త్రీభాష కవి శతాధికగ్రంథకర్త సిద్దిపేట
కం: దాశరథి రచనలు గొప్పవి
      దశదిశలందునను కీర్తి దక్కెను మిన్నన్
      శశివిధ సినిమా పాటలు
       దశ విధ రాగాల లయల దండిగ రాసెన్
   
కం: తెలగాణ సాహితి ఘనుడు
       పలువిధ కావ్యాలు రాసి ప్రభగా వెలిగెన్
       పూనియున వరస భరితము
        గానములను యల్లి గొప్ప కవిగను నిలిచెన్
 
కం: వీనుల విందగు నెన్నియొ
      గానములను రాసిమిన్న ఘనతకు నెక్కెన్
      తేనెలు కురిపిన భావన
       మానసమున మరువలేము మాన్యూడ మదిలో

కం: మధురము నింపిన పాటలు
      పదిమందియు మెచ్చునట్లు పరగనురాసిన్ 
      సుధ ధారలు జిమ్మె బహుగ
      సదయుడ నీరచనలందు సాహితి నందున్

కం: రాష్ట్రము కీర్తియు నిలబడె
      రాష్ట్రము కవి రత్నమైన రచకుడ నీవే
      రాష్ట్రము ముద్దుల బిడ్డవు
      రాష్ట్రము కవులందరికిని రాజువు నీవే