సీసమాలిక పద్యంఆషాడ మాసాన హాయిని గూర్చేడివర్షాలు కురియును వసుధ నందు,పుడమితల్లి మురిసి పులకరించు జూడపచ్చని మొలకలా పదిలముగ,ఆనంద మిచ్చేడి నారుద్ర పురుగులుసింధూరము వలెను సేద్య మందు,గాంచగన్ రైతన్న ఘనముగా ముదముతోచేత నాగలి బూని చేయు పనులు,దండిగా పంటలు ధాన్యము నిండగన్కర్షకు నింటిలో కలల పంట,కొత్తగా పెళ్లైన కూతుర్లు నత్తింటినుండియు వచ్చేరు నూతనంగ,ఆడబిడ్డలు నంత హాయిగా గోరింటచేతులందు నిడుచు చిందులేయు.తేటగీతి.రైతులు పనులు జేయును రాత్రి పగలు,చేతి నిండపంటలు దీయు చేవగల్గి,ప్రకృతి నేస్తము నారుద్ర పైడి పురుగు,కాలమందు సింధూరము గాంచముదము.
కాలపు సింధూరం:---: మచ్చ అనురాధ--తెలుగు భాషోపాధ్యాయురాలు--జి.ప.ఉ.పాఠశాల కుకునూర్ పల్లి, కొండపాక మండలం , సిద్దిపేట జిల్లా.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి