నీవు నేను ఒక పద్యం:-ఎం. వి. ఉమాదేవి నెల్లూరు

 దత్త పదులు -మేలు /పాలు /వేలు /తేలు 
ఆట వెలదులు 
మేలు కొనవె యలరు మేలుమంగమ్మవె 
పాలు తేనె కలిపి పాయసమిడి 
శ్రీని వాసు వేలు  శ్రీలక్ష్మి  గొనియెను 
హాసమందు తేలు హరియునిపుడు!

మేలు జేయు వలెను మెచ్చగా జనులెల్ల 
పాలు పంచు కొనుము పరుల బాధ 
వేలు కూడ బెట్ట వెంటరా దెన్నడు
చివరి దశను తేలు చిత్త మందు!

కామెంట్‌లు