*త్యాగాల పండుగ బక్రీద్* ;-" కావ్యసుధ " సీనియర్ జర్నలిస్ట్( విశ్రాంత) హైదరాబాద్

 బక్రీద్ పండుగ
ఇబ్రహీం (అలై )
త్యాగ నిరతికి ప్రతీక
పేదల పాలిట పెన్నిధి
ముస్లింలకు అల్లా సన్నిధి
బక్రీద్ పండుగ నాడు
ఇబ్రహీం (అలై ) త్యాగాలను
ప్రపంచ ముస్లిములు
స్మరించుకుంటారు
దైవం ఒక్కడే అని
పిలుపునిచ్చి
తనకుటుంబాన్ని
అల్లా సూచనమేరకు
బలి చేసిన త్యాగం.
కన్న కొడుకును
బలి చెయ్యాలని దైవం
కలలో ఆదేశిస్తే 
తండ్రి కొడుకులు ఇద్దరు
దైవాజ్ఞను శిరసావహించి
తండ్రి ఎత్తిన కత్తి
ఇస్మాయిల్ను సంహరించలేదు.
అల్లా ఇబ్రహీం నిబద్ధతను                        
పరీక్షించాడు
ఇస్మాయిల్కు బదులుగా
బలి ఇవ్వడానికి
స్వర్గము నుంచి
పొట్టేలును పంపించాడు అల్లా
ఇబ్రహీం త్యాగానికి ప్రతీకగ
జరుపుకునే పండుగ బక్రీద్ 
బక్రీద్ పండుగ అంటే
మేకలను బలి ఇవ్వడం కాదు
 'ఈదుల్ అజ్ హా ' అంటే
బక్రీద్ త్యాగాల పండుగ.
బక్రీ మాంసాన్ని నాలుగు                    
 భాగాలుగా చేసి, 
మూడు భాగాలు బంధుమిత్రులకు
మరో భాగం బీదలకు పంచి 
దానగుణాన్ని, త్యాగ నిరతిని 
ముస్లింలలో పెంచే పండుగ.
తనకున్న సంపదలో కొంత
బీదలకు దానం చేసే పండుగ
త్యాగాలకు ప్రతిరూపం బక్రీద్ పండుగ
( ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు)