మంత్రిగారి ఇంటిముందు
క్యూగట్టిన ఙనం తో
కిటకిట లాడుతోంది
భౌతిక దూరం పాటించని
ప్రజావాహిని ....!
అవార్డుల ---
ప్రకటన రాబోతోందట
ఆశ్చర్య పడకండి
మనకవి మిత్రులే సుమా ...
క్యూలో ఉన్నవాళ్లంతా ..!!
---------------------------------------
ప్రేమ కవిత్వ కవుల
పెరేడ్ జరుగుతుంది అక్కడ !
ప్రజల సమస్యలకు ....
స్పందించని కవిపుంగవుల
ఎంపిక జరిగేదీ ఇక్కడే ....!
స్త్రీ పురుష భేదం లేదట....
రేపటిఅవార్డు ల ఎంపికకు
ముఖ్య అర్హత ఇదేనట కదా !!
-----------------------------------------
నాలుగు పుస్తకాలు ప్రచురించి
నాలుగువందల కవితలు రాసేసి
వందల సంఖ్యలో వ్యాసాలు
పాఠకులమీదికి విసిరేసి ...
వేయికళ్లతో ఎదురు చూస్తున్నాడు
జ్ఞానపీఠం కోసమట లెండి ....!!
--------------------------------------------
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి