తెగిపోతే తీసుకురండి...:-- జయా

 అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అబ్రహాం లింకన్ ని గౌరవించడమేంటీ అని అనుకున్న ఓ ఐశ్వర్యవంతుడు ఆయనను అవమానపరిచే ఉద్దేశంతో వైట్ హౌస్ కి వచ్చాడు. 
"లింకన్ ! చూసేవా...ఈ చెప్పులూ....ఇది మీ నాన్న కుట్టిచ్చినవి..." అని ఐశ్వర్యవంతుడు హేళనగా అన్నాడు. 
"మరచిపోకు...నువ్వొక చెప్పులు కుట్టే అతని కొడుకువని చెప్పాలన్నదే ఆయన ఉద్దేశం"
అయితే లింకన్ అతని మాటలను సీరియస్సుగా తీసుకోక "అవి చూసినప్పుడే తెలిసింది, మా నాన్నే కుట్టిచ్చినవని. అందుకే ఇంత కాలంగా మీరవి ఉపయోగిస్తున్నారు. అయినా మిత్రమా ఓ మాట. అవెప్పుడైనా తెగిపోతే మీరు ఏమాత్రం ఆలోచించకుండా నా దగ్గరకు తీసుకురండి. నేను కుట్టిస్తాను" అన్నారు. 
ఆ మాటతో ఐశ్వర్యవంతుడు ఏం చెప్పాలో తెలీక సిగ్గుతో తలదించుకుని వెళ్ళిపోయాడు.