వేషం చూసి నమ్మరాదు (బుజ్జిపిల్లలకు బుజ్జికథ) దార్ల బుజ్జిబాబు

 ఓ కుందేలుపిల్ల దారి తప్పింది. ఇల్లు ఎక్కడ ఉందో గుర్తించలేకపోయింది. అడవంతా వెదికింది. చీకటి పడబోతుంది. దానికి భయం వేసింది. రాత్రికి ఎక్కడైనా తలదాచుకోవాలనుకుంది. ఓ జింక ఇంటికి వెళ్ళింది. అక్కడే ఉండాలి అనుకుంది. అప్పుడే అక్కడకు వచ్చిన జింకను చూసింది. దాని మెలికెలు తిరిగిన వాడిగా ఉన్న  కొమ్ములు చూసి భయపడింది.  ఇక్కడ ఉండటం మంచిది కాదు అని భావించింది. 
        పక్కనే ఉన్న నక్క ఇంటికి వెళ్ళింది. దాని అమాయకమైన చూపులు చూసి ఇది  మంచిదానిలాగే ఉంది అనుకుంది.  తాను దరితప్పిన విషయం చెప్పి ఆరాత్రి అక్కడ ఉంటానని అడిగింది.  నక్క సంతోషంగా సరే అంది. అర్ధరాత్రివేళ నక్క లేచింది. కుందేలుపిల్ల కుతిక పట్టుకుంది. తినటానికి నోటివద్ద పెట్టుకుంది.  మెళకువతో ఉన్న  జింక వేగంగా వచ్చి నక్కను ఒక్క కుమ్ము కుమ్మింది. నక్క కుందేలు పిల్లను వదిలింది. పడుతూ లేస్తూ  పారిపోయింది. ఆరాత్రి జింకవద్దనే ఉంది కుందేలు పిల్ల.  తెల్లవారిన తరువాత కుందేలు ఇంటికి వెళ్లి పిల్ల కుందేలును, తల్లి కుందేలుకు అప్పగించింది జింక.  అందుకే వేషాన్ని చూసి ఎవరిని నమ్మకూడదు.
కామెంట్‌లు