1)ఉజ్వల ఉద్బవ ఉషోదయ ఉషస్సుల
ఉద్యాన ఉల్లాస ఉత్సాహపు
ఉతృష్ట ఉన్నతి ఉన్నత ఉత్తమ భాష
వినరా బిడ్డా !మన తెలుగు వైభవం !
2)ప్రత్యూష ప్రకీర్తి ప్రబంధ ప్రమోద
ప్రదోష ప్రదక్షిణ ప్రణీత ప్రపంచ
ప్రణతుల ప్రద్యుమ్న ప్రధమ ప్రాచుర్య భాష
వినరా బిడ్డా !మన తెలుగు వైభవం !
3)తెలింగ త్రిలింగ తెనింగ తెనుంగ
తెనుగ తురంగ తరంగ
తరణి తత్వ తొలి తెలుగు భాష
వినరా బిడ్డా !మన తెలుగు వైభవం !
4)సాహితీ సాగర సజ్జన సింధూర
సుస్వరుప సుమధుర సోయగ సూక్ష్మ
సునిశిత సరళ సుందర సృజన భాష
వినరా బిడ్డా !మన తెలుగు వైభవం !
5)పులకింత పరిమళ పరమోత్సాహ
పరమ ప్రీతియగు పూజ్యనీయ
పుణ్య ఫలమిచ్చు పవిత్ర భాష
వినరా బిడ్డా !మన తెలుగు వైభవం !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి