01.
తేటగీతిమాలిక.
జానపదకళారూపమైసౌరుకెక్కె
బుర్రకథలకుపుట్టిల్లుభువినిపైన
ప్రముఖమైనట్టి"గుంటూరు"పరిఢవిల్లె
మారెనే"జంగముకథ"యీతీరుగాను
"నాజరను"జ్ఞానవేత్తయేనాన్నయయ్యి
ఖ్యాతిగూర్చియునిలిచినకవివరుండు
యిందుకథకుడు,వంతలుచిందులేసి
చేతియందున"తంబూర"చిత్రగతిని
వంతలిరువురు"గుమ్మెట"పట్టుకొనుచు
"తందనానాయనుచునుతాతన్మయముగ"
మధ్యమధ్యనగమ్మత్తుమాటలాడి
చెప్పుచుందురుజనులంతమెచ్చుకొనగ
రకములెన్నియోకలవిలరమ్యముగను
ఒకటిపౌరాణికమ్ముమరొకటి దేశ
భక్తి,సంబంధమైనొప్పెభాసురముగ
నిద్దరునుగానిమువ్వురుపద్ధతిగను
స్త్రీలు;పురుషులుయీకథచెప్పుతారు
"తంగిరాలసుబ్బారావుతగినవిధము"
"శిష్టపరిశోధననుజేసిశిష్టుడయ్యె"
బ్రతుకుచుండిరిదీనిపైవసుధపైన యెందరెందరోవిద్వాంసులందరికిని
వందనంబులనందింతునందముగను!!!
గమనిక :- "నాజరుగారిని బుర్రకథా పితామహుడు అని పిలుస్తారు"!!!
"బెంగుళూరు విశ్వవిద్యాలయములో తెలుగు ఆచార్యులుగా విశిష్టసేవలందిస్తున్న మాన్యులు తంగిరాలవేంకటసుబ్బారావు గారు బుర్రకథ కళాప్రక్రియపై పరిశోధనగావించి డాక్టరేటు పట్టాను పొందిన సరస్వతీపుత్రులు"!!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి