రాఖీపండుగ-పద్యాంజలి!!!":-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్--తెలుగు ఉపన్యాసకులు-సిద్ధిపేట-చరవాణి : 6300474467

 01.
తే.గీ.
"రాఖిపౌర్ణమిజూడగారమ్యమొప్పి"
అన్నచెల్లెలిబంధమునవనియందు
చాటి,మమతానురాగాలుసమ్మతముగ
నిలుపుపండుగనిదిగాదెనిజముసుమ్మి!!!
02.
తే.గీ.
ప్రేమయాప్యాయతలనిలపెంపుజేసి
రక్తసంబంధచిహ్నమైభక్తితోడ
నెఱుకపరచియునీపర్వమెప్పటికిని
సఖ్యతలగూర్చుచుండునుసంబరముగ!!!
03.
ఆ.వె.
అక్కతమ్మునకునుఅన్నకు చెల్లెలు
రాఖికట్టుచుండురక్షయనుచు
విజయపథమునందువెడలవలెననియు
దీవెనందజేయుదివ్యమలర!!!
04.
ఆ.వె.
అన్నదమ్ములకునుఅక్కచెల్లెండ్రును
ప్రేమతోడరాఖినేమముగను
కరములకునుకట్టికమనీయకానుకల్
అందుకొందురెపుడునవనిపైన!!!


కామెంట్‌లు