01.
తే.గీ.
"తీపిపంచెడిభాషమాతెలుగుభాష"
చూడముచ్చటగానుండుసుందరముగ
అక్షరములందముగనుండులక్షణముగ
సాటిరాదండియేభాషమేటియిదియె!!!
02.
తే.గీ.
"వ్యావహారికభాషకువన్నెలద్ది"
"ఉద్యమంబునుసలిపినయుక్తిపరుడు"
"గిడుగువేంకటరామ్మూర్తిగొడుగుపట్టి"
"తెలుగుదీపమైవెలిగినతేజమూర్తి"!!!
03.
ఆ.వె.
"తల్లిప్రేమవోలెయుల్లమ్మురంజిల్లి"
వెన్నెలంతహాయివెలువరించి
మల్లెపరిమళాలుమెల్లగావెదజల్లి
"తెలుగుభాషసతమువెలుగుజిమ్ము"!!!
04.
ఆ.వె.
"మధురమైనభాషమనతెల్గుభాషరా"
మహితభాగ్యశాలిమాతృభాష
ముచ్చటించవలెనుముదముగాప్రతిరోజు
"విశ్వకీర్తినొందెవిమలభాష"!!!
05.
ఆ.వె.
అలతిఅలతిపదములలరించుహృదిలోన
పంచదారవంటిపరమభాష
తేనెసోనలైనతియ్యందనముతోడ
"ఫలితమొసగుచుండువరముభాష"!!!
06.
ఆ.వె.
"గిడుగువారితెలుగుకడిగినముత్యమై"
భువినికాంతులొలుకునవయుగమున
వ్యావహారభాషప్రాభవంబునుదెల్పె
"ద్రష్టతానుకావ్యస్రష్టతాను"!!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి