*శ్రీకాళహస్తీశ్వర శతకము* - పద్యం (౮౩ - 73)

 శార్దూలము:
*మాయాజాండ కరండకోటి బొడిగా | మర్దించిరో విక్రమా*
*జేయుంగాయజు చంపిరో, కపటలక్ష్మీ | మోహంబులన్ బాసిరో*
*ఆయుర్దాయభుజంగ మృత్యువున నా | యాసంబునన్ గెల్చిరో*
*శ్రేయోదాయకులౌదురెట్టు లితరుల్ | శ్రీకాళహస్తీశ్వరా!* 
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా.....
 నీవు కాక ఇతర దేవతలు ఎవరైనా ప్రపంచపు అంచుల్ని నుగ్గు నుగ్గు చేశారా, లేదు.  ప్రాణలను తీసే పెద్ద పాములను లొంగ దీసుకున్నారా, సంపదలతో వచ్చే కోరికలను వదలు కున్నారా, యుద్ధంలో గెలవలేని మన్మధుని ఎవరైనా గెలవగలిగారా. ఇటువంటి ఎంత మంది దేవతలువున్నా, నన్ను కాపాడేది నీవే కదా చంద్రమౌళీ!.........అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*నీతో ఎన్నమార్లు మనవి చేసుకున్నా, నా మనవి ఒక్కటే, పరమేశ్వరా! నీవు, నీవు మాత్రమే నా తోడు, నీడ, ధైర్యం, దర్పం అన్నీ. ఎందువలన అంటే ఎన్ని ఉపమానాలు చూపగలను, చంద్ర చూడా! అన్యుల నెరుగ. నీవు తక్క వేరెవ్వరు లేరు. నీ లాగా మన్మధుని గెలవలేదు, సంపదలను వదులుకుని శ్మశాన వాసం చేయలేదు, పన్నగుని గెలవలేదు, ఇటువంటి అన్య దేవతలతో నాకేమి పని, ఉమానాధా! "అన్యథా శరణన్నాస్థి, తవ్మేవ శరణం మమ! రక్ష రక్ణ మహేశ్వరా! శివా!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
కామెంట్‌లు