అనురాగ బంధం
గిల్లిగజ్జాలతో పెనవేసుకున్న
మమకార బంధం
బాధ్యతై అన్నగా అవతరించే!
ఆత్మీయతలు
కలబోసుకున్న బంధం
ప్రేమను
రెట్టింపుచేసే బంధం
ఒకరికి ఒకరై తోడుండే
హృదయబంధం
చిట్టి చెల్లిగా అవతరించే!!
అమ్మలోని
ఆప్యాయత.. *అ* గా
నాన్నలోని
బాధ్యత .. *న్న* గా
రెండక్షరాలు మేళవించిన
అపూర్వ బంధమే అన్న!
నీవు నాకు రక్ష
నేను నీకు రక్ష అంటూ
నమ్మకమే నాందిగా
సాగే అనుబంధమే రక్షాబంధనం!
మనిషిని మనిషి
పెనవేసుకున్న స్నేహబంధం!!
దేశభక్తిని రంగరించిన
భారతీయ బంధం!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి