పాట:---గాజులనరసింహ-నాగటూరు గ్రామం,కర్నూలు జిల్లా-9177071129

పల్లవి:- 
ఏ శిలకు ఏరూపమో  
ఏ తావికి ఏ పుష్పమో..2
కలుగు ఏనాటికి ఏ జీవికి ఏ అదృష్టమో ...2
ఎవరికి తెలుసు ఎవరికి తెలుసు
విధి ఆటల వింతలన్ని  మూడునాళ్ళ పొంతలన్ని
ఎవరికి తెలుసు ఎవరికి తెలుసు..
చ:-  1
జన్మ జన్మాల బంధాలు అన్ని ఏనాటివో ఋణాలు అన్ని
ముడివేస్తు ఒకటిగా విధి నడిపే ఆటగా..
తానుండి సూత్రధారిగా...2 "కలుగు""
చ:-  తలుపులు తీస్తే అన్నీ ప్రశ్నలే 
తలుపులు  మూస్తే  అన్నీ వెదలే
ఎవరి మనసు ఓర్చులే ఇంకా..2
అలసిపోయే దేహాలు ఆగిపోయే చక్రాలు  ఇంకా..
కన్నులు తెరువవాయే  దైవాలు
ఏమిటో ఎందుకో ఎవరికి తెలుసు...2 "ఏ శిలకు""
చ :- 2
మూడునాళ్ళు మురిపాలు  మురిపించి ఆ నాడు
బంధించే బతుకంత ఈ నాడు
మిగిలిపాయే యింకా ఎనలేని శోకాలు

మరోజన్మ  గమ్యాలు  అవ్వెంత  దూరాలో 
అవి చేరాలియంటే ఇంకేతకాలం  చేయాలి పయనాలు
ఎవరికి తెలుసు  ఎవరికి తెలుసు.  ""పల్లవి""


కామెంట్‌లు