శివ సూక్తులు – పెద్ది సాంబశివరావు-94410 65414, peddissrgnt@gmail.com

తీగె లేక వార్త తాను పంపెదనన
అతని పిచ్చి వాడని అంత నవ్వ
మార్కొని చూపగలిగె మంచిదౌ రేడియో
మంచి పనిని నవ్వ మానబోకు.

మరణ బాధ తోడ మ్రగ్గెడు జనుల
తిరస్కార జనుల  సేవ జేసి
అమ్మ థెరిస్సా అందుకొనె పురస్కారముల
విశ్వ శాంతిదూత విజ్ఞురాలు.

చెవిటి, గ్రుడ్డి మహిళ హెలెను కీలరు
అవిటి వాండ్ర మేటి సేవ జేసి
దేశ దేశములలొ యశము గాంచెను భళా
సేవ సేయ కాదు వైకల్య మడ్డు.

మారణాయుధాల ముష్ఠి యుద్ధము నందు
కన్ను, కాలు పోయి, కష్టమొందు  
సేన సేవ జేసె వనిత నైటింగేలు
ధనిక స్ధాయి ఇల్లు వదలి వచ్చి.

తాము నమ్మినట్టి ఆశయాల కొరకు
ప్రాణమున్న వరకు పాటుబడిన
సంఘ సేవకులలొ సరియేరి గోరా కు
తలచి, చెప్పి, చేయు మొక్క రీతి.
కామెంట్‌లు
డా కె.ఎల్.వి.ప్రసాద్ చెప్పారు…
గోరా గారిని గుర్తు చేసినందుకు
కృతజ్ఞతలు.