జీవన రాగం ...!! >(ఆన్షీలు) >డా.కె.ఎల్.వి.ప్రసాద్> హన్మకొండ >9866252002*

ముఖ్యమైన స్థలాలకు రకరకాల అవార్డులకు 
ప్రముఖుల పేర్లుపెట్టి వారిని గౌరవింతురు ...
ప్రధాన కూడలులలో నాయకులవిగ్రహాలసందడి
వినుము కెఎల్వీ మాట నిజము సుమ్ము.....!!

దేశరాజధాని ఢిల్లీలో ముఖ్యనేతల సమాధులు  ,
రాజవైభోగముతో సందర్శకుల నలరించు చుండు 
రాజఘాట్ పేరుతో మహత్ముడు కొలువయ్యే నచట 
వినుము కెఎల్వీమాట నిజము సుమ్ము ...!!

ప్రధానమంత్రి పదవి నలంకరించి కూడా మన పి.వి 
ప్రతిష్టాత్మక స్థలములో సమాధికి నోచుకొనలేదుగా 
రాజకీయ క్రీడలలో రావుగారికి దక్కిన గౌరవమిది ,
వినుము కె.ఎల్వీ మాట నిజము సుమ్ము....!!

బ్రతికి ఉండగానే విజయవాడ నగరంలో పెట్టినారు 
మాజీ రాష్ట్రపతి మనసంజీవ రెడ్డి గారి విగ్రహము !
హిందీవ్యతిరేక ఆందోళనలో పడగొట్టిరి అప్పట్లో ..
వినుము కెఎల్వీమాట నిజము సుమ్ము ...!!

అన్నగారి హయాములో అవతరించే నెక్లస్ రోడ్డు 
కె .సి.ఆర్ .హయాములో అది పి.వి.రోడ్డుగా మారే !
రాజకీయమార్పుల్లో ఎన్నెన్నిస్వార్ధ పూరిత కుట్రలో 
వినుము కెఎల్వీమాట నిజము సుమ్ము ..!!

' రాజీవ్ ఖేల్ రత్న ' పేరుమార్చుకుంటున్నది సుమా 
పార్టీల రొచ్చు రాజకీయం గతప్రధానికి అవమానం !
కొత్త అవార్డు ప్రవేశపెట్టలేని కోతికొమ్మిచ్చి ఆట ఇది 
వినుము కెఎల్వీమాట నిజము సుమ్ము ..!!

కామెంట్‌లు