రైలుబండి ప్రయాణానికి చక్కనిసౌకర్యము
ఎంతదూరమైనా గాని విసుగురానిపయనం!
పాసెంజర్ బండి పేదవాడికి అనుకూలము
వినుము కేఎల్వీ మాట నిజ ము సుమ్ము !!
పొగబండిపోయిమనకుడీజిల్ రైలు వచ్చేనులే
డీజిల్ బండి కాదని ఇప్పుడు కరెంట్ బండి వచ్చే
ముందుముందు ఇంకా మార్పులెన్ని వచ్చునో
వినుము కేఎల్వీ మాట నిజ ము సుమ్ము .. !!
మొదటి ,రెండు, మూడు క్లాసులతో అప్పుడు ,
మొదటి -రెండుతరగతులతోనే రైలు ఇప్పుడు
ఏ . సి క్లాసుకె ప్రయాణికుల మొగ్గు ఇకముందు
వినుము కేఎల్వీ మాట నిజ ము సుమ్ము.. !!
రిజర్వేషన్ క్లాసులో జనాల వికృత చేష్టలు
నిద్రపోవువారికి చాలఇబ్బంది కలిగింతురు …
యెదుటవారి గురించి ఆలోచించరెందుకో !
వినుము కేఎల్వీ మాట నిజము సుమ్ము !!
ఆనందమైన ప్రయాణమునకు ఆర్డినరీ క్లాసు
పసందులేని ప్రయాణానికి రిజర్వేడ్ క్లాసు !
సుఖము కోరువారు ఏ. సి,లనాశ్రయింతురు ..
వినుము కేఎల్వీ మాట నిజము సుమ్ము !!
రైలుప్రయాణమెప్పుడూ రాత్రిపూట మేలు
నిద్రలో అలుపు మరచి హాయిగా ఉందురు
పగటిపూట పనులు చక్కబెట్టుకోవచ్చును
వినుము కేఎల్వీ మాట నిజము సుమ్ము!!
***
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి