తాతయ్య కథలు-99.. ఎన్నవెళ్లి రాజమౌళి

 ఎంత వైభవంగా ఉంది రామోజీ ఫిలిం సిటీ. అన్నది పుణ్యవతి.
పిన్ని నేను నాన్న రంగులరాట్నం ఎక్కుతాం.
వద్దు. ఆయన వయసు ఇప్పుడు 70 సంవత్సరాలు. రంగుల రాట్నం తిరిగినట్లే ఆయన కళ్ళు గిరగిరా తిరుగుతాయి. అన్నది పుణ్యవతి.
ఏమి కాదు పిన్ని. నాన్నకు సాహసకృత్యాలు అంటే ఎంతో మక్కువ.
బావకి షుగరు, బిపి ఉంది. ఏమన్నా అయితే ఎట్లా అన్నది పుణ్యవతి.
ఏమి కాదు. నేను రంగులరాట్నం ఎక్కుతా అన్నాడు చంద్రమోహన్.
వద్దండీ. వయసు మీద పడ్డ కొద్ది మీరు చిన్నపిల్ల గాని లా  చేస్తున్నారు అన్నది మల్లిక.
ఏమి కాదు అమ్మ నేను వెంబడి ఉంటాగా  అన్నాడు కొడుకు.
ఇద్దరు వెళ్లి రంగులరాట్నం ఎక్కారు. ఆ రంగుల రాట్నం తిరుగుతుంటే.. కళ్లు తిరిగ సాగాయి చంద్రమోహన్ కి. గట్టిగా పట్టుకో అన్నాడు కొడుకు. ఆ మాటతో  రంగులరాట్నం ని గట్టిగా పట్టుకున్నాడు. కొడుకు కూడా తండ్రిని పట్టుకున్నాడు.
రంగులరాట్నం ఆగింది. అమ్మయ్య అన్నాడు చంద్రమోహన్.
మా బావ అప్పుడే కాదు ఇప్పటికీ హీరోనే.. ఆయనకుఇదో  లెక్క అని, పుణ్యవతి అక్కతో అంటుంటే.. ముసిముసిగా నవ్వింది మల్లిక.
కామెంట్‌లు