భరత ఖండము: చ క్క ని పా డి యా వు "శంకర ప్రియ.," శీ ల.,సంచార వాణి:99127 67098

 👌భరత ఖండము మనది
     పాడి గోవు వంటిది
     క్షీర ధారల నొసగు!
                ఓ తెలుగు బాల!
👌మన "భరత ఖండము".. "పాడి యావు" వంటిదని; ఆంగ్లేయుల పరి పాలనలో.. స్వ దేశీయు లందరు.. తల్లి పాలు త్రాగలేని నిస్సహాయులని, అభి వర్ణించారు.
 👌విదేశీయులు పరిపాలించడం వలన, మన వారు.. స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు కోల్పోతున్నారని; విప్లవ శంఖం పూరించారు. ప్రజల కళ్ళు తెరిపించారు. స్వాతంత్ర్య సంగ్రామంలో.. ఆశువుగా ఈ పద్యమును పేర్కొన్నారు.
          👌 తేట గీతి పద్యము
        భరత ఖండము చక్కని "పాడి యావు"
        హిందువులు "లేగ దూడలై" ఏడ్చు చుండ,
        తెల్ల వారను గడసరి "గొల్ల వారు"
        పితుకు చున్నారు, "మూతులు" బిగియ గట్టి!
  (... శ్రీ చిలక మర్తి లక్ష్మీ నరసింహం గారు., స్వాతంత్ర్య సమర యోధుడు )
కామెంట్‌లు