"నారాయణి" దివ్య లీలా మూర్తులు"శంకర ప్రియ.," శీల.,సంచార వాణి: ,99127 67098


 👌సర్వ మంగళ! గౌరి!
     శ్రీదేవి! వరలక్ష్మి!
     కాపాడుమా! మమ్ము!
           నారాయణి! శివాని!
 ( "నారాయణి" పదాలు., )      
👌 పరం బ్రహ్మ రూపిణీ నారాయణి, దివ్య లీలా మూర్తులే.. "మంగళ గౌరి" మరియు "వర లక్ష్మి" దేవతలు! మగువలకు "సౌభాగ్యము" నొసగు మాతృ మూర్తులు!
👌శ్రావణ మాసంలో వచ్చే మంగళ వారం నాడు.. "మంగళ గౌరీ" దేవిని; శుక్ర వారము నాడు.. "వర లక్ష్మి" దేవిని; స్త్రీలందరూ భక్తి ప్రపత్తులతో పూజించు చున్నారు.
👌శ్రీమాత దివ్యానుగ్రహము వలన.. గృహస్థు లందరు; ఆయు రారోగ్యములు, భోగ భాగ్యములు పొందు చున్నారు. వారీ విధముగా శ్రీమాతను ప్రార్థించు చున్నారు!
🙏 మత్తేభం (ప్రార్థనా) పద్యం
         లలితా! పద్మజ! శాంకరీ! శుభకరీ!లాలిత్య సంపూర్ణ రూ
         ప లతా శాంభవి! వైష్ణవీ! ప్రధిత శర్వ ప్రాణమా! రామ! మం
         జుల కాత్యాయని! శంఖినీ! గిరిజ! విష్ణు ప్రేయసీ! సర్వ మం
          గళ గౌరీ! వరలక్ష్మి! మా కొసగుడీ కామ్యార్ధ సర్వస్వమున్!!
      
     ( రచన: "ఆర్షకవి శిరోమణి" విద్వాన్ బులుసు వేంకటేశ్వరులు గారు వ్రాసిన "మంగళ గౌరీ వరలక్ష్మి శతకము" నుండి.,)
కామెంట్‌లు