*మాపల్లె అందాలు* *(బాలగేయం)*:- *మిట్టపల్లి పరశురాములు* *సిద్దిపేట* *చరవాణి:9949144820*
మాపల్లెకుఒక్కసారివెళ్లిరావాలి
పచ్చనిపొలాలన్నిచూసిరావాలి

పొలంగట్టు మీదసేదతీర్చుకొవాలి
పైరగాలి పైరులతో పైటవేయాలి

ఊరిచెరువులోనమేముఈతకొట్టాలి
చెరువుగట్టుమీదకలసిదరువులెయాలి

చేదబావిలోనమంచినీళ్ళుతాగాలి
మోటకాడిబావిలోనమునిగితేలాలి 

మర్రి చెట్టుఊడలతోఊయలుగాలి
 వేపచెట్టునీడలోననిదురపోవాలి 

పాలపిట్టనుచూసిమేముఈలవెయాలి 
కోయిలమ్మపాటతోగొంతుకలపాలి

పావురాయితోటిమేముపరవశించాలి
అందాల నెమలితోఆటలాడాలి 

అమ్మ చెప్పే కథలన్నిఆలకించాలి
కమ్మనైన జున్నపాలుతాగి రావాలి
                  ****
 


కామెంట్‌లు